Yuvagalam Invitations యువగళం పాదయాత్రకు ఆహ్వానిస్తున్న టీడీపీ శ్రేణులకు ఎదురైన ఆసక్తికర సన్నివేశం - nara lokesh Yuvagalam Padayatra
🎬 Watch Now: Feature Video
Yuvagalam Padayatra Invitations: యువగళం పాదయాత్రలో తప్పకుండా పాల్గొంటా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవాలి అంటూ ఓ స్థానికుడు తన ఆవేదనని పంచుకున్నాడు. వైసీపీ పాలనలో తాను ఎంతగా ఇబ్బందులు పడుతున్నానో తెలియజేశాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, మహిళలు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. పట్టణములోని ప్రతి ఇంటికీ తిరిగి స్థానిక మహిళలకు బొట్టు పెట్టి లోకేశ్ పాదయాత్రకు రావాలని.. యువగళం పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని ఆహ్వానిస్తున్నారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ తిరిగి పట్టణ ప్రజలను ఆహ్వానిస్తున్న సందర్భంలో ఓ ఇంటి యజమాని తాను లోకేశ్ యువగళం పాదయాత్రలో తప్పకుండా పాల్గొంటానంటూనే తనకు జగన్ ప్రభుత్వ పాలనలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వద్దకు పలుమార్లు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేదని.. టీడీపీ పార్టీ శ్రేణులతో తన ఆవేదనను చెప్పుకున్నాడు. అంతేకాక రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అవలంబించబోయే రాక్షసతత్వంపై.. అదే విధంగా వాలంటీర్ల తీరుపై, ఓటర్ లిస్ట్‌లో చోటుచేసుకుంటున్న తప్పులపై పార్టీ శ్రేణులకు వివరించాడు.