ఇక్కడ అమ్మాయి, అమెరికా అబ్బాయి - తిరుపతిలో ఏడడుగులు 'ఎలా కలిశారంటే!' - Tirupati District love marriges News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 7:54 PM IST

Indian Girl American Boy Love Marriage: ప్రేమకు.. ఎల్లలు, జాతి, మతం, కులం, దేశం, హద్దులు అనేవి ఉండవని నిరూపించారు ఈ ప్రేమికులు. ఇష్టాలు, అభిరుచులు కలవటంతో.. భారతీయ యువతి, విదేశీ యువకుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అమెరికాకు చెందిన జేమ్స్ లాయిడ్‌ని, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రోషిణి వైష్ణవి.. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కుటుంబ సమేతంగా విచ్చేసి.. వధూవరులను ఆశీర్వదించారు.

Love Marriage in Hindu Tradition: ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జె.విద్యాసాగర్ రెడ్డి, విజయలక్ష్మి 1990లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. వీరి కుమార్తె రోషిణి వైష్ణవి.. అమెరికాకు చెందిన జేమ్స్ లాయిడ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించటంతో శుక్రవారం తిరుపతి జిల్లాలో హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వరుడి సంప్రదాయ పద్ధతిలో అమెరికాలో వేడుక జరగనున్నట్లు వధువు తండ్రి విద్యాసాగర్ రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.