కాకినాడ సముద్ర తీరంలో భారత రక్షణ దళం మాక్ డ్రిల్ - సముద్ర తీరంలో మాక్ డ్రిల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Coast Gaurd Mock Drill: భారతీయ తీరప్రాంత రక్షణ దళం (కోస్ట్‌గార్డ్) తూర్పు రీజియన్ ఆధ్వర్యంలో కాకినాడ కాలుష్య విపత్తు స్పందన మాక్‌డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. 'పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్ సైజ్-2023' పేరిట సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఈ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రమాదం సంభవించి ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు సముద్రంలోకి ఒలికిపోయిన సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే విధానాన్ని మాక్‌డ్రిల్‌లో సిబ్బంది ప్రదర్శించారు. చమురు తెట్టును సముద్రపు జలాల నుంచి తొలగించడంలో కోస్ట్ గార్డ్ యూనిట్లు, చమురు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇతర భాగస్వామ్య సంస్థల శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ ఎక్సర్సైజ్ ఏర్పాటు చేసినట్లు కోస్ట్ గార్డ్ కమాండెంట్ జీవీ మాధవ్ తెలిపారు. కాలుష్య నియంత్రణ నౌకతో సహా ఆరు ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌకలు, ఒక ఐసీజీ డోర్నియర్ విమానం, ఒక హెలికాఫ్టర్ పాల్గొన్నాయి. కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా యంత్రాంగంతో పాటు చమురు సంస్థల ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.