Independence Day Celebrations in MBU University: 8వ తరగతిలోనే కుల వివక్షను ఎదిరించా.. ఎంబీయూ వీసీ మోహన్‌బాబు
🎬 Watch Now: Feature Video
Independence Day Celebrations in MBU University: తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో గల మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో(ఎంబీయూ) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంబీ యూనివర్శిటీ ఛాన్స్లర్, సినీ నటుడు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ వేడుకల సందర్భంగా శ్రీకాళహస్తి సమీపంలోని తన స్వగ్రామమైన మోదుగులపాలెం నుంచి వచ్చిన గ్రామస్థులతో మోహన్ బాబు కొద్దిసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన గ్రామస్థులతో మాట్లాడుతున్న సందర్భంలోనే కుల, మతాల గురించి తనకు పట్టింపు లేదని మోహన్ బాబు అన్నారు. చిన్నప్పటి నుంచే తాను వాటికి వ్యతిరేకినని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 8వ తరగతిలో జరిగిన ఓ విషయాన్ని గ్రామస్థులతో పంచుకున్నారు. గతంలో లాగా నేటితరంలో అనురాగాలు ఆప్యాయతలు లేవని.. అప్పట్లో అన్ని వర్గాల వారు అక్క, తమ్ముడు, మామ, అల్లుడు అని సంబంధం కలుపుకొని మరీ పలుకరించుకునే వారని గుర్తుచేస్తూ... ఈ కాలంలో అవి కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.