YSRCP Leaders Illegal Mining అర్ధరాత్రి గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 4:02 PM IST

Illegal Soil Movement: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలగొండ గ్రామ చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఈటాచీ, టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. నెలగొండ గ్రామంలో.. 500, 505 సర్వే నంబర్​లో 150 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న చెరువులో రాత్రి సమయంలో వైసీపీ నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారం గ్రామస్థులకు అందింది. దీంతో గ్రామస్థులంతా అర్ధరాత్రి సమయం నుంచే చెరువు వద్దకు చేరుకొని టిప్పర్లను అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్థులు వాటిని పోలీసులకు అప్పగించారు. అక్రమంగా మట్టిని తరలించటంలో వైసీపీ నాయకులే కీలక పాత్ర పోషిస్తున్నారని, చెరువు మట్టిని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండలు, వాగులు అన్నీంటినీ తవ్వేశారని.. ఇప్పుడు చెరువులను కూడా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇక చెరువులు కూడా మిగిలించరా? జీవరాశులు బతక కూడదా అని నెలకొండ గ్రామస్థులు ప్రశ్నించారు. మట్టి తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని.. దీనివల్ల తమ గ్రామస్థులు, పశువులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.