రోడ్లపై ఎందుకు ఇంత కక్ష! జగనన్న హయాంలో రోడ్ల వేయడం కాదు - వేసిన రోడ్డునూ దోచుకెళ్ళిపోతున్నారు - రోడ్లపై కంకర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 7:55 PM IST
|Updated : Dec 9, 2023, 9:13 PM IST
Illegal Gravel Transportation in Tullur Mandal : సీఎం జగన్ హయాంలో రోడ్ల దుస్థితి ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, అమరావతి రోడ్లను తవ్వుకుని కంకర ఎత్తుకెళ్లిపోతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రోడ్లు వేయాల్సిన ప్రభుత్వం, వేసిన రోడ్డును తవ్వుకుని మట్టి - కంకరను అమ్ముకుంటున్న సొంత గూటి దొంగలను పట్టుకోలేకపోతుందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమరావతిపై జగన్కు ఉన్న కోపంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజధాని ప్రాంతంలో అక్రమార్కులు చెలరేగిపోతూనే ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలకు మేలు చేసేవని కూడా చూడటం లేదు. వారి స్వంత లాభం కోసం అక్రమాలకు దిగుతూనే ఉన్నారు. పోలీసుల అండదండలు ఉండటంతో అధికార పార్టీ నాయకులు ఈ చర్యలకు పూనుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రాజధాని ప్రాంతంలో అక్రమ రోడ్డు తవ్వకాలు ఆగడం లేదు. తుళ్లూరు మండలం లింగాయపాలెం వద్ద కొంతమంది ఇష్టం వచ్చినట్లు రోడ్డును తవ్వేశారు. రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కంకరను తవ్వి తీసుకెళ్తున్నారు. సీఆర్డీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజధాని రోడ్డులో, దాదాపు మూడు అడుగుల మేర కంకరను తవ్వి తీసుకెళ్లారు. సీడ్ ఆక్సిస్ ప్రధాన రహదారిలో దాదాపు 20 మీటర్ల దూరం వరకు కంకరను తరలించారు. దాదాపు 20 లారీల వరకు కంకరను అక్రమంగా రవాణా చేశారు. పోలీసుల అండదండలతో స్థానిక అధికార పార్టీ నేతలే ఇలా అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రాజధాని రైతులు అంటున్నారు.