భారత రాజ్యాంగ దినోత్సవం - భీమ్ సేన ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ - Constitution Day 2023
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 11:40 AM IST
Huge Rally in Visakha Beach Road on Occasion of Constitution Day of India 2023 : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. భీమ్ సేన (Bhim Sena) ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా భీమ్ సేన వ్యవస్థాపకుడు రవి సిద్దార్థ (Bhim Sena Founder Ravi Siddhartha) మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆవశ్యకతను తెలియజేయడానికి ప్రతీ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. వేల మందితో బీచ్ రోడ్లో ర్యాలీ చేస్తుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
"దేశ వ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవాలి : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేసి కుల, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రచించారు. దేశంలో అన్ని పండుగలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవాలి. రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడానికి విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించాం."- రవి సిద్దార్థ, భీమ్ సేన వ్యవస్థాపకుడు