Heavy Traffic on Paderu Ghat Road: పాడేరు ఘాట్ రోడ్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఇబ్బంది పడ్డ వాహనదారులు - Problems of motorists on Paderu Ghat Road
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 12:59 PM IST
Heavy Traffic on Paderu Ghat Road: పాడేరు ఘాట్ రోడ్లో రెండు లారీలు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌రోడ్ మలుపులో లారీలు నిలిచిపోయి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. తాజాగా 2 లారీలు ఒకదాని తరువాత ఒకటి ఘాట్ రోడ్డు ఎక్కలేక నిలిచిపోయాయి. దీంతో వాటి వెనుకాల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రతిరోజు ఇలా జరగడంతో ట్రాఫిక్ సమస్య అధికమైపోతుందని వాహనదారులు వాపోతున్నారు.
నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి దగ్గర్లో పోలీసులు కూడా ఎవరూ లేకపోవడంతో వాహనదారులే ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేసుకున్నారు. ఇలా నిత్యం పాడేరుకు 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఘాట్‌రోడ్డులో భారీ వాహనాలు రావడంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు. తామే ఈ సమస్యను పరిష్కరించుకొని వెళ్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ మార్గం వేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.