Heavy rains in Giddalur Prakasam District: ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న ఉప్పు వాగు.. వరద నీటిలో చిక్కుకున్ ఫైర్ ఇంజన్ - rains in ap
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 11:40 AM IST
Heavy rains in Giddalur Prakasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి గిద్దలూరు సమీపంలోని ఉప్పు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఉప్పు వాగును ద్విచక్ర వాహనంపై దాటుతుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ దేవ ప్రభాకర్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వాగులో గల్లంతై ముళ్ల చెట్లల్లో చిక్కుకున్న ఇద్దరు యువకులను పోలీసులు రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వెళ్తున్న ఫైర్ ఇంజన్ కొండపేట రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీటిలో చిక్కుకుంది. ఇక్కడ రైల్వే నూతన బ్రిడ్జి నిర్మిస్తున్న క్రమంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇది తెలియని అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెళ్తున్న క్రమంలో వరద నీటిలో (Fire Engine Stuck in Flood Water) చిక్కుకుంది. క్రేన్ సహాయంతో ఫైర్ ఇంజన్ని అధికారులు వెలికి తీసే ప్రయత్నం చేశారు.