Rains in AP: రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. నేలకూలిన వృక్షాలు - నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
Rains across the state: రాష్ట్రంలో ఇవాళ బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఒక్కసారిగా వీచిన గాలితో అనేకచోట్ల చెట్లు విరిగి నేలమట్టమయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గాలుల ధాటికి అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. క్రేన్ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అల్లూరి జిల్లా పాడేరులో గంటపాటు కురిసిన భారీ వర్షానికి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అటవీశాఖ ఉద్యానవనంలోని భారీ వృక్షం రోడ్డుకు అడ్డుగా పడింది. దీంతో కలెక్టరేట్ గోడ, కుమ్మరిపుట్టు అటవీశాఖ గేటు దెబ్బతిన్నాయి. ఆదివారం జన ప్రాబల్యం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. భారీ గాలులు వీస్తుండటంతో విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ని నిలిపివేశారు.