ఘనంగా హజరత్​ ఖాదర్​ వలీషా ఉర్సు ఉత్సవాలు - పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు - ap cultural news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 1:25 PM IST

Hazrat Qader Wali Shah Urusu Mahotsavam in Prasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ హజరత్​ ఖాదర్​ వలీ షా దర్గా 172వ ఉర్సు మహోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఉర్సు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గాను విద్యుత్​ కాంతులతో చక్కగా అలరించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని దర్గా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Devotees Gathered in Large Numbers : హజరత్​ ఖాదర్​ వలీ షా దర్గాను దర్శించుకుంటే మంచి జరుగుతుందని, పీడ తొలగిపోతుందని, కోరుకున్న వారికి సంతానం కలుగుతుందని అక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దర్గాను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని దర్గా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఉర్సు మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.