Gudiwada Jagananna Colony Condition: గుడివాడలో చెరువులా జగనన్న హౌసింగ్ కాలనీ.. కన్నెత్తి చూడని కొడాలి నాని - జగనన్న హౌసింగ్ కాలనీ
🎬 Watch Now: Feature Video
Gudiwada Jagananna Colony: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న హౌసింగ్ కాలనీ పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే స్వయంగా గుడివాడలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ అతి పెద్ద హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవ స్థితికి వచ్చే సరికి కాలనీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో గుడివాడ రూపురేఖలే మార్చేస్తున్నానంటూ చెప్పుకుంటున్న కొడాలి నాని, జగనన్న హౌసింగ్ కాలనీ వైపు చూసే సాహసం కూడా చేయలేకపోతున్నారు. వర్షాలు తగ్గి రెండు రోజులు గడిచినా.. కాలనీ రోడ్లు ఇప్పటికీ చెరువులను తలపిస్తున్నాయి.
వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో చెరువుల మాదిరిగా మారిన కాలనీలో ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు కట్టుకోకపోతే తొలగిస్తామంటూ వాలంటరీలు బెదిరిస్తున్నారని, కట్టుకుందామని అప్పుచేసి పనులు ప్రారంభిస్తే కాలనీ లోతట్టు ప్రాంతం కావడంతో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇంటి మెటీరియల్ కొట్టుకుపోయిందని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Janasena Leaders Visited Gudiwada Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జనసేన నాయకులు ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడ జగనన్న కాలనీలో జనసైనికులు పర్యటించారు. జగనన్న కాలనీలో మీటర్ ఎత్తు మెరక చేయల్సింది.. అర మీటర్ మాత్రమే చేశారని మండిపడ్డారు. దీని కారణంగానే ప్రజలు నీటిలో మగ్గిపోతున్నారని ఆవేదన చెందారు. వైకాపా నాయకులు చేసిన తప్పిదాలకు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని ఆగ్రహించారు. మౌలిక సదుపాయాలు లేక నానా అవస్ఖలు పడుతున్నామని లబ్ధిదారులు వాపోయారు.