మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - నిలిచిన ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 8:51 PM IST
Govt E-Office Network Services Stopped by Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో ఉన్న రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయంలో తుపాను కారణంగా ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి.
Michaung cyclone Effect E-Office Network Services Stopped: మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయంలో ప్రభుత్వ ఈ-ఆఫీస్ నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ-ఆఫీస్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో సచివాలయంలో ఈ-ఆఫీస్ ఫైళ్ల సర్కులేషన్ నిలిచిపోయాయి. తుపాను ప్రభావంతోనే కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.
పాఠశాలలకు సెలవు: ఈదురుగాలులు, వర్షాల కారణంగా కాకినాడ నుంచి నెల్లూరు జిల్లా వరకు రేపు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.