విశాఖకు కార్యాలయాల తరలింపు - ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ - విశాఖలో సీఎం కార్యాలయం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 4:07 PM IST
Government Lunch Motion Petition Rejected by High Court : ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే అంశంపై ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ మంగళవారం జరుపుతామని పేర్కొంది.
సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు (CM office in Vizag) తరలిస్తున్నారని రాజధాని రైతులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా కార్యాలయాల తరలింపు అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని ప్రభుత్వం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తిరస్కరించిన న్యాయస్థానం దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది