దిగి వచ్చిన నగరపాలక సంస్థ - చెత్తపన్నును సగానికి తగ్గింపు - కర్నూలు నగరానికి నీటి సమస్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 12:22 PM IST
|Updated : Nov 11, 2023, 10:58 PM IST
Garbage Tax reduce in kurnool : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో చెత్తపన్నును సగానికి తగ్గిస్తున్నట్లు మేయర్ బీవై రామయ్య తెలిపారు. చెత్త పన్ను కట్టేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టిని వచ్చిందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో... మురికివాడల్లో ఇంటికి రోజుకు ఒక రూపాయి, మిగిలిన ప్రాంతాల్లో 2 రూపాయల చొప్పున చెత్తపన్ను వసూలు చేయనున్నట్లు రామయ్య సృష్టం చేశారు. నగరం పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చెత్తపన్నును సగానికి తగ్గించడం వల్ల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌లో మెరుగైన స్థానం పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్నూలు నగరానికి నీటి సమస్య ఉండబోదని.. కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. కొత్త వాటర్ ప్లాంట్‌తో నీటి సమస్య తగ్గిందని పేర్కొన్నారు. సుంకేసులకు తుంగభద్ర నుంచి వరద నీరు వస్తోందనియ, గాజుల దిన్నె ప్రాజెక్ట్ లోనూ నీటిని నిల్వ చేసినట్లు వివరించారు. కర్నూలు నగరపాలక సంస్థలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇరువురు ఈ విషయాలను వెల్లడించారు.