పారిశుద్ధ్య కార్మికుల సమ్మె - నగరాల్లో పేరుకుపోయిన చెత్త
🎬 Watch Now: Feature Video
Garbage Piled Up Due to Sanitation Workers Strike : రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రకాశం జిల్లా కనిగిరి రోడ్లపై వ్యర్థాలు రోడ్లపై పేరుకుపోయి భరించలేని దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో స్థానికులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అంటు రోగాల భయంతో ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేసినప్పటికీ అవి కూడా నామమాత్రంగా ఉన్నాయని స్థానికులు తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ 15 రోజులకు చేరింది. రాష్ట్రంగా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పారిశుద్ధ్య కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రజలను చెత్త నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.