చింతపల్లి, తుని నుంచి గంజాయి - చిత్తూరు జిల్లాలో విక్రయం - ముఠా అరెస్ట్ - a gang arrested for illegally transporting ganja
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 9:37 PM IST
Ganja Selling Gang Arrested in Chittoor District : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది కేజీల గంజాయి, రూ. 60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చింతపల్లి, తుని ప్రాంతాల నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ ముఠా కొద్ది కాలంగా పలమనేరు, గంగవరం చుట్టూ పక్కల గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో.. కొద్దిరోజుల క్రితమే గంగావరం ఎసై, సీఐ ఆధ్వర్వంలో స్పెషల్ టీమును ఏర్పాటు చేశామని డీఎస్పీ వివరించారు.
గంగావరంలోని డ్రైవర్స్ కాలనీలో ఉంటున్న రాజేంద్ర అనే వ్యక్తి కొంతకాలంగా తుని, చింతపల్లి ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెచ్చి ఇక్కడి చుట్టూపక్కల వారికి అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది. ఈరోజు(గురువారం) ఉదయం మామడుగు బస్టాండ్ వద్ద రాజేంద్రని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతనితో పాటు మరి కొందరు ఈ గంజాయి విక్రయిస్తున్నట్టు బయటపడింది. దీనికి సంబంధించి రాజేంద్రతోపాటు.. శివ, యశ్వంత్ కుమార్, అహ్మాదుల్లా, తులసిరామ్..అనే వారిని అరెస్టు చేశామన్నారు. గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.