Ganesh Immersion Celebration In Kurnool : కర్నూలులో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 2:02 PM IST

Updated : Sep 26, 2023, 4:19 PM IST

Ganesh Immersion Celebration In Kurnool : రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఓల్డ్ టౌన్​లోని రాంబొట్ల దేవాలయం నుంచి మొదటి ఊరేగింపు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 2 గంటలకు వినాయక ఘాట్ వద్ద నిమజ్జనం మొదలు కానుంది. హనుమాన్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రెండో ఊరేగింపు ప్రారంభమవుతుంది. కల్లూరు చౌరస్తా నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మూడో ఊరేగింపు, నంద్యాల చెక్ పోస్టు నుంచి మధ్యాహ్నం నాలుగో ఊరేగింపు ప్రారంభం కానున్నాయి. నిమజ్జనం కోసం వినాయక ఘాట్​లో.. 3 ప్లాట్ ఫారంలు, 9 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 2 వేల విగ్రహాలు నిమజ్జనం చేయనున్నట్లు.. అధికారులు వివరించారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Last Updated : Sep 26, 2023, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.