Gali Janardhan Reddy: అఫిడవిట్లో తప్పుడు సమాచారం... గంగావతి మేజిస్ట్రేట్ ముందుకు 'గాలి' ఎన్నికల పంచాయితీ - about Gali Janardhan Reddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 3:56 PM IST
|Updated : Oct 29, 2023, 6:42 PM IST
Gali Janardhan Reddy: కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి ఎమ్మెల్యేగా గెలిచిన గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు పత్రాలు సమర్పించినట్లు... టపాల్ శ్యాంప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు గంగావతి మేజిస్ట్రేట్‌ను ఆయన ఆశ్రయించారు. గాలి జనార్దన్ రెడ్డి, అతడి కుటుంబ సభ్యులు అక్రమ మైనింగ్ కేసులో ఉన్నప్పటికీ రాజకీయ బలంతో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. గాలి ఎన్నికల అఫిడవిట్ (Election Affidavit) లో ఆస్తి పత్రాలలో తప్పుడు సమాచారంతో సమర్పించారని శ్యాం ప్రసాద్ ఆరోపించారు.
ఇదే అంశంపై గంగావతి పోలీస్ స్టేషన్లో శ్యాం ప్రసాద్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడ ఉన్నవారు స్పందించకపోవడంతో పాటుగా.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదంటూ... పోలీసులపై చర్యలు తీసుకోవాలని గంగావతి మేజిస్ట్రేట్ (Magistrate) ను ఆశ్రయించినట్లు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న ఆయన... న్యాయం గెలిచే వరకు పోరాడుతానని తెలిపారు. టపాల్ శ్యాంప్రసాద్ ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన సాక్షిగా ఉంటూ గాలి జనార్దన్ రెడ్డిపై పోరాడుతున్నారు.