సీఎం గారు వస్తున్నారు.. వాహనాలు పక్కకు ఆపేయండహో..! లబోదిబోమంటున్న లారీ డ్రైవర్లు! - Ground breaking ceremony for Greenfield Airport
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18408081-1006-18408081-1683095965875.jpg)
International Greenfield Airport: సీఎం పర్యటన లారీ డ్రైవర్లకు పెద్ద కష్టాన్ని తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లో జాతీయ రహదారిపై భారీగా లారీలు నిలిచిపోయాయి.. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద సీఎం వస్తున్నారని భారీగా లారీలను నిలిపేశారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర లారీలు ఆగిపోయాయి. దీంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టడం సహా విశాఖపట్నం – మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తుగా లారీలు నిలిపేశామని.. పోలీసులు తెలిపారు. సీఎం విజయనగరంలోని భోగాపురం వస్తే సుమారు 130 కి మీ దూరంలోని పలాస వద్ద తమ వాహనాలను ఆపేయడమేంటని లారీ డ్రైవర్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.