Former SEC Nimmagadda Ramesh Applied for Vote మరోసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎన్నికల కమిషనర్ - Nimmagadda Ramesh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2023/640-480-19191887-181-19191887-1691248886748.jpg)
Former SEC Nimmagadda Ramesh Applied for Vote: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ ఓటు హక్కు కోసం మరో సారి దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని తన నివాసంలో ఓటు హక్కు కోసం నిమ్మగడ్డ రమేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంటింటా ఓటు హక్కు తనిఖీల్లో భాగంగా దుగ్గిరాలలో తన ఇంటికి వచ్చిన బీఎల్వో అధికారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు ఫారాన్ని అందించారు. హైదరాబాద్లోని తన ఓటును అక్కడి ఎన్నికల సంఘం కార్యాలయంలో సరెండర్ చేశానని.. తాజాగా ఏపీలోని తన స్వగ్రామంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నానని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. గతంలో ఓటు హక్కు ఇవ్వకపోవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో మరోసారి దరఖాస్తుకు అవకాశం వచ్చింది. లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల గతంలో తాను చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని నిమ్మగడ్డ రమేష్ అన్నారు. ఈ సారైనా ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా తనకు ఓటు హక్కు కల్పించాలని నిమ్మగడ్డ రమేష్ కోరారు.