Paritala Sunitha Selfie Challenge: నాలుగేళ్లలో ఏం చేశారు.. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి పరిటాల సునీత ఛాలెంజ్
🎬 Watch Now: Feature Video
EX Minister Paritala Sunitha Selfie Challenge: విద్యార్థుల కోసం నిర్మించిన స్టేడియం.. అతిథి గృహంగా మార్చటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. దాదాపు 2.20 కోట్ల రూపాయల నిధులతో స్టేడియం నిర్మించామని.. వైసీపీ ప్రభుత్వం చేసిందేంటని మాజీ మంత్రి పరిటాల సునీత సెల్పీ ఛాలెంజ్ విసిరారు. పిల్లలను క్రీడలకు దూరం చేసిన ఘనత రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిదేనని ఆమె ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, జిమ్, పెవిలియన్, కాంపౌండ్ నిర్మించినట్లు సునీత సెల్ఫీ ఛాలెంజ్లో వివరించారు. వైసీపీ ప్రభుత్వం దానిని నాశనం చేసిందని.. మైదానం నిర్మించగా వైసీపీ ప్రభుత్వం దానిని గెస్ట్హౌజ్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి ప్రాంతంలో గతంలో ఎలాంటి క్రీడా మైదానం లేక విద్యార్థులు ఇబ్బంది పడేవారని.. క్రీడా ప్రతిభ ఉన్నవారి కోసం సరైన సదుపాయాలు ఉండేవి కావని వివరించారు. దీనిని గమనించి.. మైదానాన్ని, ఇతర సామాగ్రిని ఏర్పాటు చేశారని.. సకల సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైదానం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. దీని గురించి పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఇందులో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాల్లో కొన్నింటిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మరికొన్ని నిరుపయోగంగా మారిపోయాయి. అలాగే ఇండోర్ స్టేడియం ఎందుకు పనికిరాకుండా పోయింది. మరోవైపు క్రీడాకారుల కోసం నిర్మించిన గదులను ప్రభుత్వాధికారులకు అప్పనంగా అందించారు. వారు మైదానంలో పిల్లలు ఆడుకునే సమయంలో అడ్డు చెప్తున్నారు. అసలు ఈ మైదానాన్ని నిర్మించిన అవసరాన్ని అధికార పార్టీ విస్మరించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.