Devineni Uma On Polavaram: సీఎం జగన్రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపం : దేవినేని ఉమ
🎬 Watch Now: Feature Video
Devineni Uma On Polavaram: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం, అహంభావం పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. పోలవరం నిలిచిపోవడానికి ప్రధాన కారకుడు జగన్ రెడ్డేనని ఆరోపించారు. కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడని దేవినేని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పోలవరంలో జరుగుతున్న పనుల్ని రద్దు చేయవద్దని, కొత్త ఏజెన్సీలను పెట్టవద్దని పీపీఏ, కేంద్ర ప్రభుత్వం చెప్పినా జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ముందుకెళ్లాడని మండిపడ్డారు. కొత్త సంస్థలకు పనులు అప్పగిస్తే, జరిగే తప్పిదాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న కేంద్ర ప్రభుత్వ ప్రశ్నకు ముఖ్యమంత్రి నోరెత్తలేదని దుయ్యబట్టారు. కమీషన్లకు ఆశపడి, పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడని ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరంలో జరిగిన ప్రతి పనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించిందన్నారు. జగన్ వచ్చాక ఎంతమేర పనులు జరిగితే ఎన్ని కోట్లు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. పోలవరంలో కుంగింది గైడ్ బండ్ కాదు.. జగన్ రెడ్డి పరువు, ప్రతిష్టలని దేవినేని అన్నారు.