Forest Officials Captured Elephant: ఎట్టకేలకు చిక్కింది.. దంపతులను హతమార్చిన ఏనుగును బంధించిన అటవీ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
Forest Officials Captured Elephant: చిత్తూరు జిల్లాలో దంపతులను హతమార్చిన ఏనుగులను అటవీ సిబ్బంది బంధించారు. గుడిపాల మండలం 190 రామాపురం వద్ద పొలాల్లో ఏనుగును నిర్భందించారు. కుప్పం నుంచి తెచ్చిన రెండు శిక్షణ ఏనుగులతో మరో ఏనుగును బంధించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఏనుగును అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన ఏనుగును తిరుపతి జూపార్కుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిన్న గుంపు నుంచి విడిపోయిన ఓ ఏనుగు పొలాలపై పడి బీభత్సం చేసింది. 190 రామాపురంలో పొలంలో పనిచేస్తున్న దంపతులు వెంకటేశ్, సెల్విలపై దాడి చేసి వారిని హతమార్చింది. అదే విధంగా సీకే పల్లెలో కార్తీక్ అనే యువకుడిపై సైతం దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగి.. ఏనుగును పట్టుకున్నారు. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఎక్కువగా దాడులకు పాల్పడుతున్నాయి. దాడులను అరికట్టేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావట్లేదు. తాజాగా దంపతులను బలిగొన్న ఏనుగును అటవీ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.