టీడీపీ నేత ఇంటి ఎదుట వైసీపీ జెండా దిమ్మె నిర్మాణం - రాజకీయ విభేదాలు సృష్టించొద్దని స్థానికుల హెచ్చరిక
🎬 Watch Now: Feature Video
Flag Dispute Between TDP and YCP Leaders in Prakasam District : ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని బెస్త వీధిలో టీడీపీ నేత ఇంటి ముందు అనుమతి లేకుండా వైసీపీ నాయకులు తమ పార్టీ జెండా నిర్మించడానికి ప్రయత్నించడంతో ఉద్ధృత వాతావరణం నెలకొంది. 'ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి' కార్యక్రమంలో భాగంగా కంభంలోని సచివాలయం-3 పరిధిలో జెండా ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు భావించారు. తెలుగు వీధి కూడలిలో బుధవారం రాత్రి జెండా దిమ్మె కట్టించారు. అయితే సదరు నివాసం కలిగి ఉన్న వ్యక్తిని సంప్రదించకుండా వైసీపీ జెండా దిమ్మను నిర్మించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.
టీడీపీ నేత ఈ విషయాన్ని వెంటనే పంచాయతీ అధికారులకు చెప్పిన స్పందించకపోవడంతో దిమ్మెను తానే పెకిలించివేశాడు. దాంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు జోక్యం చేసుకుని ఇరుపార్టీల సభ్యులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, తమ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ పార్టీల జెండాలు, దిమ్మెలు లేవని, అన్ని కులాల వారు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో సామరస్యంగా ఉంటున్నామని స్థానికులు తెలిపారు. తమ ప్రాంతంలో రాజకీయ పార్టీల జెండాలు ఏర్పాటు చేయడానికి ఒప్పుకోమని స్థానికులు గట్టిగా చెప్పడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.