TDP Bus Yatra: చైతన్య రథయాత్రలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట.. - నల్లబొడ్లూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వివాదం వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2023/640-480-19017256-630-19017256-1689566156575.jpg)
TDP and YCP Leaders Dispute: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర టీడీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఈ యాత్రలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో చైతన్య రథయాత్ర సాగిన ఊర్లన్నీ పసుపుమయంగా మారాయి. అయితే ఈ యాత్రలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బస్సు యాత్రలో భాగంగా.. మందస మండలం నల్లబొడ్లూరు గ్రామంలో.. గతంలో వైఎస్సార్సీపీ నేతలు పూర్తిగా తవ్వేసిన కొండను పరిశీలించేందుకు టీడీపీ నేతలు.. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు.. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.