Crop Loss: ప్రభుత్వ నిర్లక్ష్యం.. నీట మునిగిన వందలాది ఎకరాలు - కృష్ణా జిల్లాలో పంట నష్టం
🎬 Watch Now: Feature Video
Farmers Fires on Government Negligence: కృష్ణా జిల్లాలో డ్రెయిన్లు పూడిక తీయకపోవడం వల్ల.. వందల ఎకరాల పైర్లు నీటమునిగాయి. కంకిపాడు, ప్రొద్దుటూరు, దావులూరు, నెప్పల్లి, కోలవెన్ను, కుందేరు, కొణతనపాడు గ్రామాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో.. నీటిని బయటకు పంపడానికి దాదాపు ఆరు కిలోమీటర్ల పొడమైన ముస్తఫాఖన్ డ్రెయిన్‌ను గతంలో ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్తఫాఖాన్ డ్రెయిన్‌కు పూడికతీతను నిర్లక్ష్యం చేయడంతో అది నేడు రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం ఈ డ్రెయిన్ పూర్తిగా.. గుర్రపుడెక్కతో నిండిపోయింది. ఇప్పుడు అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అదనపు నీరు రైవస్ కాల్వలో కలవకుండా పొలాల్లోకి ఎగదన్నుతోందని రైతులు చెబుతున్నారు. డ్రెయిన్ నీరు, వర్షపు నీరు కలిసి.. తమ పొలాలను ముంచెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాలువల బాగు చేసేందుకు రూ. 30 కోట్లు కేటాయించామని ప్రజా ప్రతినిధులు చెప్పారని, కాలువలు బాగు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వేసవిలో బాగు చేసి ఉంటే.. వందల ఎకరాలకు ముంపు తప్పేదని రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం.. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.