Amaravathi Farmers warned CM about Chandrababu's health చంద్రబాబు ఆరోగ్యంపై జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం.. రాజధాని రైతుల భారీ ర్యాలీ - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 9:20 PM IST

Farmers Rally in Amaravati to Protest Chandrababu Arrest: రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అమరావతిలో రాజధాని రైతులు చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ తీరును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఇంకా తలెత్తితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని రాజధాని రైతులు హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు, కొత్తూరు, కొడాలి నుంచి గ్రంథాలయం సెంటర్ వరకు ర్యాలీ చేశారు. చంద్రబాబుకి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి మౌన దీక్ష చేపట్టారు. చంద్రబాబు కుటుంబంపై అవాకుల చవాకులు పేలుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నోటిని అదుపులో పెట్టుకోకపోతే తమకు నచ్చిన రీతిలో బుద్ధి చెబుతామని మహిళలు తేల్చి చెప్పారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అన్నీ గమనిస్తున్నారని త్వరలోనే మిమ్మల్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.