Famers Protest For Current on Road : ఎండుతున్న పంటలు.. మండుతున్న రైతులు.. విద్యుత్ కోతలపై కన్నెర్ర - ఏపీలో కరెంటు కోతలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 5:49 PM IST

Farmers Protest For Current on Road : తీవ్రమైన విద్యుత్తు కోతల వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నామని (Power Cuts in AP) చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కి నిరసన తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్తు ఉప కేంద్రం ఎదుట రహదారిపై బైఠాయించిన రైతులు.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున నినదించారు. పోలీసులు రైతులతో మాట్లాడి సర్ధిచెప్తూ.. ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అనంతరం గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ కార్యాలయంలోకి వెళ్లిన రైతులు అధికారులను నిలదీశారు. కుప్పం గ్రామీణ మండలంలో సాగుకు రోజూ కనీసం రెండు గంటలైనా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల చేతిలో ఉన్న ఎండిన పంటలను అధికారులకు చూపించి.. తమ కష్టాన్ని నీరుగాల్చే విధంగా వ్యవహరించ వద్దని అన్నారు. అదేవిధంగా సాగునీటితో పాటు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఇవ్వాలని రైతుల అధికారులను డిమాండ్ (Farmers Demand to Electricity) చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.