భూముల రీ-సర్వేను వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా - అరెస్ట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 9:46 PM IST

Farmers Protest against Lands Re-survey: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం రైతులు ధర్నాకు దిగారు. తమ మండలంలో భూముల రీ-సర్వేను తక్షణమే నిలిపివేయాలంటూ రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Farmers Comments: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను వ్యతిరేకిస్తూ మంగళవారం కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ''జగన్ ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే ఈ ప్రక్రియను ఆపాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం. 'అధికారంలోకి రాకముందు నేను రైతు బిడ్డనీ, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం' అని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్, నాలుగున్నరేళ్లుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని రీసర్వేను నిలిపివేయాలి'' అని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.