'ఇదేంది సిద్ధారెడ్డీ?' సాగు భూములు ఇళ్ల పట్టాలుగా మార్చి పంపిణీ - అడ్డుకున్న బాధిత రైతులు - కదిరిలో రైతులు ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 6:59 PM IST

Farmers Protest Against kadiri MLA sidda Reddy : ఎవరైనా బహుమతి ఇవ్వాలనుకుంటే అంతో ఇంతో ఖర్చు చేయాలి. కానీ, 'అత్త సొమ్ము అల్లుడి దానం' అన్నట్టుగా ఉంది ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వైఖరి. పేద రైతుల భూమిని చదును చేయించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బాధిత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులతో బలవంతంగా నెట్టేయించారు.

వివరాలివీ.. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని చదును చేసి ఇంటిపట్టాలుగా మార్చడాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని బాధిత రైతులు అడ్డుకోబోయారు. కదిరి కుటాగుళ్లలో సర్వే నంబర్‌ 41లోని గుట్టలోని 14 ఎకరాల భూమిని 70 ఏళ్ల నుంచి తాము సాగు చేసుకుంటున్నామని 10మంది రైతులు తెలిపారు. అయితే ఆ భూమిని చదును చేసి 250 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఆ పట్టాలను పంపిణీ చేసేందుకు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వచ్చారు. ఆయన వాహనానికి అడ్డుపడ్డ రైతులు ఆ భూమి తమదని ఎమ్మెల్యేకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు లాగేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.