'పోలీసుల తనిఖీలు' ఇంటికి వెళ్లలేక, తినడానికి ఏమీలేక! - చంటి పిల్లలతో రోడ్లపైనే వలస కూలీలు - గిరిజన ప్రాంతాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 9:45 AM IST
Farmers No Crops And Food in Tribal Areas In Alluri District : పంటలు పండక, పండిన వాటికి గిట్టుబాటు ధర రాకపోవటంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలనే లక్ష్యంతో గిరిజనులు వలస బాటపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందరికీ అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాలైన ముంచింగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు మండలాల నుంచి కూలీలు వలస వెళ్లిపోతున్నారు. కొండ ప్రాంతాల్లో సరైన పంటలు, ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకు వలసలు వెళుతున్నట్లు తెలిపారు.
సుదూర ప్రాంతమైన విజయవాడ, గుంటూరు తదితర పరిసర ప్రాంతాల్లో రోజు వారీ కూలీలుగా వెళ్తున్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ఇస్తే తాము ఇక్కడే ఉంటామన్నారు. 8 వాహనాల్లో ఓవర్ లోడ్‌తో వెళుతుండగా పోలీసులు వాహనాలను సీజ్ చేయడంతో ఎటు వెళ్లాలో తెలియక చంటి పిల్లలతో వలస కూలీలు ఇక్కట్లు పడ్డారు. అటు ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేక తినడానికి తిండి లేక అదే వాహనాల్లో ఉండిపోయారు. వాహనాలు వదిలి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.