తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం - కౌలు రైతు ఆత్మహత్యాయత్నం - Farmers Commit Suicide in ashwaravu palem
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 2:55 PM IST
Farmer Commit Suicide Loss Of Crop Due to Michaung: మిగ్‌జాం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం తగిన భరోసా కల్పించకపోవటంతో రైతులు ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తుపాను ధాటికి పంట దెబ్బతినడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అశ్వరావు పాలెంలో రైతు ఆత్మహత్యకు యత్నించాడు.
Kochi Andhra Association Given 25Thousand Farmer Family: గ్రామానికి చెందిన వెంకట పూర్ణయ్య తనకున్న కొద్దిపాటి భూమికి తోడు మరో 14 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. కోతకొచ్చిన వరి పైరు మిగ్‌జాం తుపాను కారణంగా నేలవాలి, కోత కోసేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సాగుకోసం చేసిన అప్పులు తీర్చే గత్యంతరం లేక వెంకట పూర్ణయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు ఆయన భార్య నాగ ఉష తెలిపారు. వెంటనే బాధితుడిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. రైతు కుటుంబానికి కొచ్చి ఆంధ్ర అసోసియేషన్ వారు అందించిన రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని బుద్ధప్రసాద్ బాధితుడి కుటుంబానికి అందించారు.