"మరో 3నెలల్లో వైసీపీ కాలం చెల్లిన పార్టీగా మారుతుంది" - వైసీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 1:29 PM IST
EX Minister Ganta Srinivasarao Fires On CM Jagan: వైసీపీ మరో మూడు నెలల్లో కాలం చెల్లిన పార్టీగా మారుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఊరందూరులోని బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో నవరత్నాలల్లో ఒక్క రత్నమైనా వందశాతం పూర్తిచేశామని ఆ పార్టీ నేతలు తెలియజేయగలరా? అని గంటా సవాల్ విసిరారు.
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి విశాఖకు ఏ మోహం పెట్టుకుని వస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు. సుజల స్రవంతి పథకం ఇంకా పూర్తి చేయలేదని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయకపోవడం, నూలు ప్రాజెక్టులు సైతం మూతపడడం దారుణమని అన్నారు. జగన్ మాటలకు ఉత్తరాంధ్ర ప్రజలు మోసపోయే స్థితిలో లేరని అన్నారు.