జగన్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు - బహిరంగ చర్చకు సిద్ధం : గంటా - TDP Leaders Comments on YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 6:48 PM IST
Ex Minister Ganta Srinivasa Rao Fires on YSRCP : వైసీపీ ఏ ఒక్క సంక్షేమ పథకమైనా నూటికి నూరు శాతం అమలు చేసిందని నిరూపిస్తే తాము రాజీనామాలకు సిద్ధమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారని, ఆయన పాలనలో 98 శాతం వరకు విఫలమయ్యారని విమర్శించారు.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ పథకాన్నీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని గంటా ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఎవరైనా సరే, ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని గంటా అభిప్రాయం వ్యక్తం చేశారు.