Chandrababu fire on CM Jagan: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం - వైఎస్సార్సీపీ వచ్చి గంజాయికి హబ్
🎬 Watch Now: Feature Video
Chandrababu fire on Chief Minister Jagan : తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విభజన నాటికి 16 వేల కోట్ల రెవెన్యూ లోటు, విద్యుత్ కొరత, అప్పులతో ఏర్పడిన రాష్ట్రాన్ని... నవ నిర్మాణ దీక్షల పేరుతో ఇబ్బందులను అధిగమించే దిశగా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నామన్నారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని వివరించారు. అమరావతి రాజధాని కొనసాగి ఉంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చుండేదన్న చంద్రబాబు... వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యే దన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చాలనుకుంటే... వైఎస్సార్సీపీ వచ్చి గంజాయికి హబ్ గా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంలోనూ రాష్ట్రాన్ని అథమ స్థానంలోకి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడడం లేదన్న చంద్రబాబు...కేసుల నుంచి బయటపడితే చాలు సీబీఐ అరెస్ట్ చేయకుంటే చాలన్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు.