PRATHIDWANI: కేంద్ర బడ్జెట్ పైనే అన్ని వర్గాల ఆశలు - 2023 central budget debate
🎬 Watch Now: Feature Video

Pratidwani: మేడమ్ మధ్య తరగతిని కరుణిస్తారా. దేశంలోని కోట్లాది మంది మదిలోని మాటిది. పదేళ్ల నుంచి ఎన్నో ఎదురుచూపులు. అదిగో ఇదిదో అన్న వాయిదాలు, వృద్ధిబాటకు బాసట కోసం ఇంత కాలం ఎలానో పంటి బిగువున భరించారు. కానీ కొంతకాలంగా పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. కరోనా మిగిల్చిన కష్టాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాజేసిన అగ్గి, మాంద్యం భయాలు, కట్టు తప్పుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల శరపరంపరలో దిక్కుతోచని అభిమన్యుడిలా మారింది మధ్య తరగతి, వేతనజీవుల పరిస్థితి. అందుకే ఎప్పుడూ లేనంతగా కేంద్ర బడ్జెట్ వైపు గంపెడాశలతో చూస్తున్నారు కనీసమైన ఊరడింపు కోసం. మరి వారి వినతుల్ని నిర్మలమ్మ ఏ మేరకు మన్నించే అవకాశం ఉంది. లేకుంటే వారి పరిస్థితి ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.