Prathidwani సంక్రాంతి పండుగ చెప్పే సంగతులు ఏంటో మీకు తెలుసా - ఏపీలో సంక్రాంతి పండుగ చెప్పే సంగతులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17486452-985-17486452-1673708659299.jpg)
Prathidwani సంక్రాంతి పండుగ అంటేనే ఊరంతా సందడి. గాలిపటాలు, కోడిపందేలు, హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు ఇలా ఎన్నెన్నో సరదా వేడుకలు ఈ పర్వదినాల సందర్భాన. అదంతా సరే అసలు ఈ సరదాల సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారు. ఆటపాటలు, పిండివంటలు, ఇంటిల్లిపాది సందడే కాదు అంతకు మించి ఈ పర్వదినాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి. జ్యోతిష్యశాస్త్రం, పంచాంగం ప్రకారం, గ్రహ గమనాల విషయంలో సంక్రంతి చెప్పే సంగతులు ఏమిటి. సంక్రాంతి, పొంగల్ ఇలా పేరు ఏదైనా తరతరాలుగా సంబరాల సంక్రాంతి మన జీవితాల్లో ఎందుకని ఇంతగా పెనవేసుకుని పోయింది. ఈ ఆనందాల హరివిల్లుల వేడుక వెనక ఉన్న ఆధ్యాత్మిక సంగతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST