Prathidwani: సీఎం మాటల్లో పరమార్థం ఏంటీ..? తాను పేదవాడా..! అబద్దాలు, అభూత కల్పనలు ఎవరివి! - prathidwani debate on chief minister
🎬 Watch Now: Feature Video
Prathidwani: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏ సభలోనైనా పదేపదే అవే విషయాలు చెబుతున్నారు. తాను పేదవాడినని, పెత్తందారులతో పోరాటం చేస్తున్నానని వాపోతున్నారు. ఇంతకీ ఎవరు పేదలు? ఎవరు పెత్తందారులు అనే ప్రశ్న అందరిలో ఉంది. తనకి మీడియా బలం లేదని చెప్పుకుంటున్నారు.. మరి సీఎంకి నిజంగా మీడియా బలం లేదా?
దోచుకునేవారు, పంచుకునేవారితో తాను పోరాటం చేస్తున్నానని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు దోచుకుంటున్నారు? ఎవరు పంచుకుంటున్నారు? తనని విమర్శించేవారిని అబద్దాల బ్యాచ్ అని ముఖ్యమంత్రి పేరు పెట్టారు. నిజానికి ఎవరివి అబద్దాలు, ఎవరివి అభూత కల్పనలు?
ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమాన్ని తీసుకుని వెళుతుంటే చూడలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారని సీఎం అంటున్నారు. ఇది నిజమేనా? తనకు ఆర్థికబలం లేదని ఇటీవలే ఓ బహిరంగసభలో ప్రస్తావించారు. మరి దేశంలోనే అత్యంత సంపన్న సీఎం అన్న ఏడీఆర్ నివేదిక రావడాన్ని ఎలా చూడాలి? అసలు ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు? ఆయన మాటల్లో నిజమెంత? అబద్దాల బ్యాచ్ ఎవరిది? ఇదీ నేటి ప్రతిధ్వని.