Elephants Attack on Farms in Chittoor District: రెండు ఏనుగుల వీరంగం.. వారం రోజులుగా పంట పొలాలు ధ్వంసం.. - గొల్లపల్లె లోకల్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 4:56 PM IST

Elephants Attack on Farms in Chittoor District: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు వీరంగం సృష్టిస్తున్నాయి. పంటలపై పడుతూ.. రైతులకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి. గొల్లపల్లె పరిధిలోని పీఎంకే తాండలో.. వారం రోజుల నుంచి రెండు ఏనుగులు ఆ ప్రాంతంలో నివసించే రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగుల సంచారంతో ఆ ప్రాంతంలోని రైతులు పొలాలకు వెళ్లేందుకు.. ప్రజలు బయటకి వచ్చేందుకు జంకుతున్నారు. పొలాల మీద పడి వీరంగం సృష్టిస్తున్న ఏనుగులు.. ఆ ప్రాంత పొలాల్లోని వరి, అరటి, బొప్పాయి పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. 

ఏనుగుల సంచారం పై సంబంధిత  శాఖాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా..  అధికారులు తమ సమస్యను పట్టించుకోవట్లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యపై అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన తమ పంటలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.