Drunken Man Misbehave మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై యువకుడు వీరంగం.. - Drunk Man attack on constable in Rayachoti
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2023/640-480-18949063-932-18949063-1688826170928.jpg)
Drunk Man Misbehave With Police in Rayachoti : రాష్ట్రంలో కొందరు యువకులు వారి బాధ్యతను మరిచి మద్యం మత్తులో జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. ఓ యువకుడు మాత్రం మద్యం మత్తులో మనిషినన్న సృహ కోల్పోయి ఓ జంతువుల ప్రవర్తించాడు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ప్రధాన కూడలిలో మందుబాబు చేసిన చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఈ నిర్వాకాన్ని చూసిన వారంతా ఛీ ఛీ అంటూ చీదరించుకున్నారు.
పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న యువకుడిని పక్కకు తొలగించేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అంతే కొపోద్రికుడైన మందు బాబు ఒక్కసారిగా కానిస్టేబుల్‌పై విచక్షణ రహితంగా విరుచకుపడ్డాడు. కానిస్టేబుల్‌పై తీవ్రమైన దుర్భాషలాడుతూ.. రెండుకాళ్లు ఎత్తి దాడి చేసేందేకు ప్రయత్నించాడు. చుట్టు పప్రక్కల ఉన్న వారు దాడిని నిలువరించే ప్రయత్నం చేసిన వారిపై దాడి చేసేందుకు వెనుకాడలేదు. చివరికి స్థానికంగా ఉన్న మరి కొందరు జోక్యం చేసుకొని పరిస్థితిని సర్దుబాటు చేశారు. అయితే ఎట్టకేలకు పోలీసు అధికారి వీరంగం సృష్టించిన యువకుడిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో కొంత సమయం పాటు వాహనాలు నిలిచిపోయాయి. మద్యం ప్రియుడి ఆగడాలను చిత్రీకరించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రదేశంలో తరచూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటున్న పోలీసుల నుంచి ఎలాంటి గట్టి చర్యలు లేకపోవడంతోనే యువకులు ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు పట్టణంలో వినిపిస్తున్నాయి.