ఆలయం చుట్టూ గాడిదలు, ఎడ్ల ప్రదక్షిణలు.. దీని వెనకున్న కథ ఏంటీ..?

By

Published : Mar 24, 2023, 11:47 AM IST

Updated : Mar 24, 2023, 11:59 AM IST

thumbnail

Donkeys Rally: కర్నూలు జిల్లాలోని ఓ ఆలయంలో వింత ఆచారం ఆకట్టుకుంటోంది. గుడి చుట్టూ బురదలో గాడిదలు, ఎడ్ల బండ్లతో స్థానికులు చేసే ప్రదక్షిణలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ వింత వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్త జనాలు తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే..

కల్లూరు మండలంలోని చౌడేశ్వరీ దేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు.. గుడి చూట్టూ బంకమట్టితో బురదను ఏర్పాటు చేసి.. అందులో గాడిదలు, ఎడ్ల బండ్లతో గుడి చూట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వర్షాలు మంచిగా కురవాలనే ఆకాంక్షతో ప్రతి ఏటా రైతులు, రజకులు కలసి ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. దీనిలో భాగంగానే ఎద్దుల బండ్లను, గాడిదలను అలంకరించి ఊరేగింపుగా తీసుకుని రావటం ఆవవాయితీగా వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఆచారంగా వస్తున్న ఉత్సవాలను ఈ సారి కూడా వైభవంగా నిర్వహించారు. ఈ వేడులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

Last Updated : Mar 24, 2023, 11:59 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.