Doctors Treated Patient under Mobile Torch Light in Kurupam : పవర్​కట్..​ కురుపాంలో మొబైల్ టార్చ్‌లైట్‌ వెలుగులో చికిత్స - village faces power cut

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 1:39 PM IST

Doctors Treated Patient under Mobile Torch Light in Kurupam : అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా ఆస్పత్రిలో ప్రమాద బాధితులకు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో వైద్యులు చికిత్స అందించారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని రాత్రి 7 గంటల నుంచి కరెంట్ తీసేయడంతో అంధకారం (Power Cut in Parvathipuram District) నెలకొంది. ఇదే సమయంలో గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాక గ్రామ సమీపంలో బ్రేక్ ఫైల్ అయి ఆటో బోల్తా పడింది., ఇద్దరికి తీవ్రగాయాలు, ఎనిమిది మందికి  స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి 108 వాహనాల్లో తరలించారు. అయితే అదే సమయంలో కరెంట్ లేకపోవడంతో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సెల్ ఫోన్​ లైట్ల సహాయంతో చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కరెంట్ లేకపోవడంతో ఆసుపత్రిలోని రోగులు నానా అవస్థలు పడ్డారు. విద్యుత్ కోతల పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.