తండ్రి ఆచూకీ చెప్పాలని పోలీసుల వేధింపులు - దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం - kollur si harassment

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:24 PM IST

Disabled Person Suicide Attempt by Drinking Pesticide: బాపట్ల జిల్లా కోళ్లపాలెంకు చెందిన మేరుగ కిరణ్ కుమార్  అనే దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరారీలో ఉన్న తన తండ్రి కిశోర్ ఆచూకీ చెప్పాలంటూ.. కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించాడు. బాధితుల వివరాల ప్రకారం చంద్రబాబు బెయిల్ మీద విడుదలైనప్పుడు నీల రామకృష్ణ, యశ్వంత్ అనే వ్యక్తుల మధ్య సామాజిక మాధ్యమాల పోస్టుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో తన తండ్రి కిశోర్ వారి మధ్య గొడవను సర్దిచెప్పే ప్రయత్నం చేశారని వెల్లడించాడు.

Harassment of SI : ఆ తరువాత యశ్వంత్ అనే వ్యక్తి స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. రామకృష్ణతో పాటు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారని కిరణ్ తెలిపాడు. ఈ విషయం తెలిసి తన తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయారని కిరణ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి.. తనను స్టేషన్​కు పిలిపించి తన తండ్రి కిశోర్ ఆచూకీ చెప్పాలని దౌర్జన్యానికి పాల్పడిందని బాధితుడు వాపోయాడు. ఆచూకీ చెప్పకపోతే  కేసులు పెడతానని బెదిరించడమే కాకుండా తీవ్రంగా కొట్టారని కిరణ్ ఆరోపించాడు. పోలీసుల బెదిరింపులతో భయపడి.. తన కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని కిరణ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కిరణ్ కుమార్​ను అతని కుటుంబసభ్యులను టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.