దివ్యాంగులకు ప్రభుత్వాలు సహకరించాలి - సక్షమ్ సంస్థ ప్రతినిధులు - అహోబిలం జీయర్ స్వామి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 5:20 PM IST
Disability Association In Vijayawada: సమాజంలో ఉన్న దివ్యాంగులను అందరితో సమానంగా చూడాలని సక్షమ్ సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన దివ్యాంగుల సమ్మేళనానికి సక్షమ్ సంస్థ ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అహోబిలం జీయర్ స్వామి పాల్గొన్నారు. దివ్యాంగులకు కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులందరూ అండగా నిలబడాలని సంస్థ ప్రతినిధులు అన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వాల నుంచి సహకారం చాలా అవసరమని వారు అభిప్రాయపడ్డారు. దివ్యాంగులకు వ్యాపార రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పింఛన్లు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని సక్షమ్ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బ్యాక్‌లాగ్ ఖాళీలు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పూర్తి చెయ్యాలి అని దివ్యాంగులు కోరుతున్నారు. నిలిపివేసిన దివ్యాంగుల వివాహ కానుకను కూడా ఇవ్వాలని కోరుతున్నాం అని వారు తెలిపారు. సమాజానికి దివ్యాంగుల శక్తిని చూపడానికే ఈ సమ్మేళనం నిర్వహించినట్లు సక్షమ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.