YSRCP leaders clashes అసమ్మతి పోరు.. అధికార పార్టీ ఎంపీపీ భర్తపై కేసు నమోదు - differences between ycp leaders
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-07-2023/640-480-19013326-207-19013326-1689506518222.jpg)
Differences between YSRCP leaders: శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఉచితంగా అందజేస్తున్న వేరుశనగ మినీ కిట్లు పంపిణీలో విభేదాలు కేసుల దాకా వెళ్లాయి. ఫలితంగా అధికార పార్టీ ఎంపీపీ కవిత భర్త రంగేగౌడపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేరుశనగ కిట్ల పంపిణీపై రంగేగౌడ్ అధికారులను నిలదీశారు. కిట్లు పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారిణి రాజ్యలక్ష్మీ అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన రంగేగౌడ్ వ్యవసాయశాఖ కార్యాలయంలో అధికారులు విధులు నిర్వహిస్తుండగా.. షట్టర్ దించి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీనిపై వ్యవసాయ అధికారిని రాజ్యలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి తాళాలు తీశారు. అదే విధంగా ఎంపీపీ భర్త రంగేగౌడ్పై కేసు నమోదు చేశారు. అనర్హులకు, ఎమ్మెల్యే చెప్పిన వారికే విత్తన మినీ కిట్లు ఇస్తున్నారని రంగేగౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతికి అడ్డుపడుతున్నామనే.. తనపై కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని రంగేగౌడ్ అంటున్నారు.