Devineni Uma on Polavaram: గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది..?: దేవినేని ఉమ - పోలవరం
🎬 Watch Now: Feature Video
Devineni Uma on Polavaram: పోలవరానికి జగనే శని అని.. రాయలసీమ ద్రోహిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ రెడ్డి నాశనం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు నిలదీస్తే.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఖర్చు పెట్టిన రూ.15 వేల కోట్లతో ఏ ప్రాజెక్టుకు అయినా నీళ్లు ఇచ్చారా.. ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని దేవినేని సవాల్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిన సంగం, నెల్లూరు బ్యారేజీలకు వారి పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం తప్ప ఇంకేమైనా చేశారా అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏం చేశామన్నది తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని.. మీరు ఏం చేశారో చెప్పగలరా అంటూ అడిగారు. రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరూ పని చేశారని తెలిపారు. ప్రతివారం సోమవారం పోలవరం పనుల వివరాలను ఆన్లైన్లో పెట్టడం జరిగిందని దేవినేని ఉమా గుర్తు చేశారు.