సమస్యల పరిష్కారానికై 9న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిరసన - ఏపీ ఉద్యోగుల తాజా డిమాండ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 5:27 PM IST

Democratic Teachers Federation Protest in Vijayawada : ప్రభుత్వ ఉత్తర్వులు 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతుల తరలింపును నిలిపి వేయాలని, జీపీఎస్ (GPS) విధానాన్ని ఉపసంహరించుకొని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో డిసెంబర్ 9వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నామని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి (Narahari) తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు 117, 128, 84, 85ల ప్రభావంతో వేలాది ప్రాథమిక పాఠశాలలు మూత పడుతున్నాయని, ప్రాథమిక తరగతులు అందుబాటులో లేక పేద పిల్లలు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Government Should Withdraw GPS Policy in AP Employees Demand : ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్​ను బకాయిలను తక్షణమే చెల్లించాలని నరహరి అన్నారు. నూతన విద్యా విధానం 20-20 సిఫారసు మేరకు పాఠశాల విద్యలో మాతృభాష మాధ్యమం అమలు చేయాలన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని, నాడు-నేడు బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరసనకు సంబంధించిన గోడ పత్రికలను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.