Dogs attack on Deer: నీళ్ల కోసం వచ్చిన జింకపై కుక్కల దాడి.. అంతలోనే..! - Annamaya District News
🎬 Watch Now: Feature Video
Deer Attacked by Dogs: ఓ జింక ప్రాణాలను కాపాడేందుకు ఓ ప్రయాణికుడితో పాటు స్థానిక యువకులు ఎంతగానో కష్టపడ్డారు. దీంతో వారందరినీ స్థానికులు అభినందించారు. ఇంతకీ ఆ యువకులు జింకను ఎలా కాపాడారనేగా మీ సందేహం. అయితే దీనిని చదివేయండి మరి. అన్నమయ్య జిల్లా నందలూరులో.. జింకపై కుక్కలు దాడి చేశాయి. జింక అటవీ ప్రాంతం నుంచి దాహం తీర్చుకునేందుకు నందలూరులోని కన్యక చెరువుకు వచ్చింది. అది గమనించిన శునకాలు.. నీటిలో దిగి జింకను వెంటాడాయి. అటుగా.. ట్రైన్లో వెళ్తున్న ఓ ప్రయాణికుడు గుర్తించి స్థానిక యువకులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక యువకులు అక్కడికి వచ్చేలోపే కుక్కలు జింకపై దాడి చేశాయి. గాయాలతో నీటిలో పడి ఉన్న జింకను ఒడ్డుకు చేర్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ జింకను చికిత్స నిమిత్తం వాహనంలో తరలించారు. గామపడిన జింకకు అధికారులు ప్రాథమిక చికిత్స చేసి.. అనంతసముద్రం అటవీ పరిధిలో వదిలేశారు. కుక్కల దాడి నుంచి కాపాడిన యువకులను స్థానికులు అభినందించారు.