ఈ నెల 25 వరకు దస్తగిరి రిమాండ్ పొడిగింపు - Dastagiri
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 7:55 PM IST
Dastagiri in Rajampeta Court: వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరిని రాజంపేటలోని మూడవ అదనపు జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గతంలో వేముల పోలీస్ స్టేషన్‌లో దస్తగిరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే కడప జిల్లా న్యాయమూర్తి రాజంపేట ఇన్‌ఛార్జ్‌గా ఉండటంతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న దస్తగిరిని పోలీసులు ఆయన ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి దీనబాబు ఈనెల 25 వరకు దస్తగిరికి రిమాండ్ పొడిగించారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తమ బంధువుల అమ్మాయిని ప్రేమ వ్యవహరంలో ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో కడప పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దస్తగిరి బంధువుల అమ్మాయి, ఎస్సీ యువకుడు ప్రేమించుకున్నారు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఎస్సీ యువకుని ఇంటి వద్ద నుంచి దస్తగిరి కారులో తీసుకెళ్తున్నాడనే సమాచారంతో, కడప నగరానికి సమీపంలో చెన్నూరు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దస్తగిరితోపాటు ఐదుగురు కుటుంబసభ్యులపై కూడా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుట్ర ఇందులో ఉందని దస్తగిరి భార్య షబానా ఆరోపించిన విషయం తెలిసిందే.